సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శనివారం, 11 సెప్టెంబరు 2021 (18:54 IST)

వేలివెన్నులో స‌నాత‌న శ్రీ లక్ష్మీ గ‌ణ‌ప‌తి...65 ఏళ్ళ‌ మంట‌పమిది

గ‌ణేష్ చ‌తుర్ధి నాడు ఎన్నో చోట్ల వినాయ‌కుడిని ప్ర‌తిష్ఠిస్తారు. ఈసారి క‌రోనా వ‌ల్ల బ‌హిరంగంగా మంట‌పాలు పెట్టొద్ద‌ని గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. కానీ, వేలివెన్నులో స‌నాత‌న శ్రీ లక్ష్మీ గ‌ణ‌ప‌తిని మాత్రం గ్రామ‌స్థులు య‌ధావిధిగా ప్ర‌తిష్టించారు. గ‌ణ‌ప‌తి స్వామిని అనాదిగా ఇక్క‌డ ఆచారంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఘ‌నంగా గ్రామ‌స్థులు వేలివెన్ను శ్రీలక్ష్మీ గ‌ణ‌ప‌తిని అలంక‌రించి, ప్ర‌తిష్ఠించారు. గత 65 సంవత్సరాలుగా వేలివెన్నులో గ‌ణేష్ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. 
 
పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్ను గ్రామంలో గాంధీ బొమ్మ సెంటరు వద్ద ఈ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి మంట‌పాన్ని ఏర్పాటు చేశారు. క‌న్నుల పండువ‌గా ఉన్న లక్ష్మీ గణపతి విగ్ర‌హాన్ని చూసేందుకు వివిధ గ్రామాల నుంచి, దూర‌పు ప్రాంతాల నుంచి కూడా భ‌క్తులు అధిక సంఖ్య‌లో వ‌స్తున్నారు. ఇక్క‌డి వినాయ‌కుడు మ‌హిమాన్వితుడ‌ని, మ‌హ‌త్వ‌పూర్ణ సుప్ర‌సిద్ధ స‌నాత‌న దేవుడ‌ని న‌మ్మిక‌. అంతే ఆచారంతో పూజారులు స్వామివారిని కొలుస్తారు. గ‌ణ‌ప‌తి న‌వ రాత్రుల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో చేస్తారు. దీనికి బీజేపీకి చెందిన ప్ర‌ముఖ నాయ‌కుడు శ్రీకాకుళ‌పు వీర‌య్య శ‌ర్మ ఏటా త‌న మిత్ర బృందంతో క‌లిసి వినాయ‌కుడిని సేవిస్తుంటారు.
 
గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా శ‌నివారం ఇక్క‌డ విశేషంగా పూజ‌లు నిర్వ హించారు. ఇందులో సవర్ణ సంఘ అఖిల భారత వైస్ ప్రెసిడెంట్, బిజెపి నాయకులు ఎస్.వి.వి. ప్రసాద్ శర్మ, బీజేపీ నాయ‌కుడు శ్రీకాకుళ‌పు వీర‌య్య శ‌ర్మ‌, ముళ్ళపూడి కాశీ విశ్వనాధం, సొసైటీ వైస్ ఛైర్మన్ సుబ్బారాయుడు, గ్రామ వై.సి.పి కన్వీనర్ శిరిగిన శివ రాధాక్రిృష్ణ, బ్రహ్మయ్య చౌదరి త‌దిత‌రులు పాల్గొన్నారు.