బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (17:48 IST)

పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం.. గర్భస్రావం కోసం బొప్పాయి.. ఆ మాత్రలు

మహారాష్ట్రలోని పుణే సిటీలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదిహేనేళ్ల బాలికపై ఒకరు పలు సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా బాధితురాలి ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వచ్చింది. పుణే పోలీసులకు బాధితురాలు ఈ విషయమై ఫిర్యాదు చేసింది. భోసారి పోలీస్ స్టేషన్ పరిధిలోని 15 ఏళ్ల బాలికపై యువకులు అత్యాచారం చేశారు. 
 
పలు మార్లు అత్యాచారం చేసిన తర్వాత సదరు యువతి గర్భవతి అని తెలుసుకుని వారు ఆమెను అబార్షన్ మాత్రలు మింగాలని బలవంతం చేశారు. ఈ క్రమంలోనే బొప్పాయి పండు తినాలని అత్యాచారం చేసిన సదరు వ్యక్తి సోదరి బలవంతం పెట్టినట్లు బాధితురాలు తెలిపింది. కొన్ని నెలల కిందటనే దత్తు పూజారి పదిహేనేళ్ల బాలిక పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో అక్కడే అత్యాచారం చేశాడని పోలీసు అధికారి తెలిపారు.
 
ధితురాలు మీడియాతో మాట్లాడుతూ తనను మొదట చెంపపైన కొట్టారని, ఆ తర్వాత బెల్టులతో కొట్టి ఓ గదిలో బంధించారని తెలిపింది. చాలా సార్లు బెల్టుతో కొట్టడం వల్ల తను స్పృహ కోల్పోయానని, అయినా తనను వదిలిపెట్టలేదని చెప్పింది.