శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (13:20 IST)

వెబ్‌సైట్‌లో టీటీడీ ఉదయాస్తమాన సేవా టికెట్లు

టీటీడీ ఉదయాస్తమాన సేవా టికెట్లు విడుదల చేసింది టీటీడీ. టీటీడీ వెబ్‌సైట్‌లో కొనసాగుతోంది విరాళాల ప్రక్రియ. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళమిచ్చిన దాతలకు ప్రివిలేజ్ గా ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయించింది. 
 
అర్ధగంటలో చిన్న పిల్లల ఆసుపత్రికి రూ.58 కోట్ల విరాళం వచ్చింది. 28 శుక్రవారం ఉదయాస్తమాన టికెట్లు, 503 సాధారణ రోజుల ఉదయాస్తమాన టికెట్లు అందుబాటులో ఉంచింది టీటీడీ. 
 
రూ.కోటి చెల్లించిన వారికి సాధారణ రోజుల్లో, రూ.1.50 కోట్లు చెల్లించిన వారికి శుక్రవారం ఉదయాస్తమాన టికెట్లు కేటాయించింది. ఇప్పటికే 24 శుక్రవారం ఉదయాస్తమాన టికెట్లు, 22 సాధారణ రోజుల ఉదయాస్తమాన టికెట్లు బుక్ చేసుకున్నారు భక్తులు.