బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 16 అక్టోబరు 2020 (23:16 IST)

ఆ కీచక ఫాస్టర్ దొరికాడు, పోలీసుల చేతిలో దబిడి దిబిడే..?

ఉద్యోగం పేరుతో ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఫాస్టర్ దైవ సహాయం. రెండురోజుల క్రితం తిరుపతిలో ఈ ఘటన జరిగింది. ఘటనపై ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. తిరుపతి నగరంలో శాంతియుత ర్యాలీ కూడా చేపట్టాయి. 
 
నేరుగా ఎస్పీ దగ్గరికి వెళ్ళి వినతిపత్రం సమర్పించాయి ప్రజాసంఘాలు. దీంతో తీవ్రంగా స్పందించిన ఎస్పీ, నిందితుడిని 24 గంటల్లోపల పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అయితే 2 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని మీడియా ముందుంచారు. 
 
బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. ఫాస్టర్ దైవ సహాయం నేరప్రవృత్తి కలిగిన వ్యక్తి అని, అతని భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఉద్యోగం చేసే యువతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రమేష్ రెడ్డి హెచ్చరించారు. నిందితుడిని అరెస్టు చేయడం కాదు.. కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.