తిరుపతి సైంటిస్ట్‌కు ఐన్‌స్టీన్ వీసాను మంజూరు చేసిన అమెరికా
తిరుపతికి చెందిన ఓ యంగ్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆ యువ సైంటిస్ట్ పేరు రవితేజ. ఆయనకు అగ్రరాజ్యం అమెరికా ఐన్‌స్టీన్ అవార్డును మంజూరుచేసింది. ఆ యువకుడిలోని ప్రతిభను గుర్తించి ఈబీ-1 వీసా కోసం ప్రభుత్వానికి ఆపిల్ కంపెనీ ప్రతిపాదన చేయగా, దీనికి ఆమోదం తెలిపిన అమెరికా రెండు రోజులు క్రితం ఈ వీసాను మంజూరుచేసింది.
తిరుపతి పట్టణంలోని స్థానిక నలంద నగర్‌కు చెందిన అనంత రవితేజ వాషింగ్టన్‌లోని ఆపిల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్ రీసెర్స్ సైంటిస్ట్‌గా పని చేస్తున్నాడు. అపారమైన ప్రతిభాపాఠవాలు కలిగిన రవితేజ.. పనితీరును గమనించిన ఆపిల్ సంస్థ... ఈబీ-1 వీసాను మంజూరు చేయాలని ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపించింది.
దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆ వీసాను మంజూరు చేసింది. అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఇచ్చే ఈ వీసా ఐన్‌స్టీన్ వీసాగా అమెరికాలో పిలుస్తారు. అలాంటి వీసాను తిరుపతి కుర్రోడు దక్కించుకోవడం గమనార్హం.
హెల్త్ టిప్స్ : శరీరంలో అయోడిన్ లోపిస్తే...
మానవ శరీరానికి అయోడిన్ ఎంతో కీలకం. అలాంటి అయోడిన్ లోపిస్తే శరీరానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా, థైరాయిండ్ హార్మోన్ ఉత్పత్తికి ఇది ఎంతో కీలకం. అందుకే ఈ పోషకం లోపిస్తే, మెటబాలిజం సమస్యలు వేధిస్తాయి. మన శరీరం స్వతఃసిద్ధంగా అయొడిన్‌ను తయారు చేసుకోలేదు. కాబట్టి మనం ఆహారం ద్వారా సరిపడా అయొడిన్ శరీరానికి అందేలా చూసుకోవాలి. ఈ పోషకం లోపాన్ని ఈ లక్షణాలు ద్వారా కనిపెట్టి వెంటనే సరిదిద్దుకోవాలి.
గుండె ఆరోగ్యం : అయొడిన్ తగ్గడం వల్ల గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. దాంతో తల తిరగడం, నిస్సత్తువ ఆవహించడం వంటి సమస్యలు వేధిస్తాయి.
మలబద్ధకం : జీర్ణవ్యవస్థ పనితీరుకు థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోను విడుదల చేయాలి. అయొడిన్ లోపంతో హార్మోన్ ఉత్పత్తి తగ్గడం మూలంగా మలబద్ధకం మొదలవుతుంది.
గర్భధారణ : అయొడిన్ లోపంతో థైరాయిడ్ హార్మోన్ స్రావం తగ్గడం వల్ల గర్భధారణ సాధ్యపడదు. అలాగే గర్భంలోని బిడ్డ నాడీ సంబంధ ఎదుగుదలకు కూడా అయొడిన్ అవసరం. కాబట్టి గర్భం దాల్చాలనుకునే మహిళలు, గర్భిణులు థైరాయిడ్ హార్మోన్ సరిపడా ఉత్పత్తయ్యేలా ఆహారంలో అయొ ఉండేలా చూసుకోవాలి.
మెడవాపు : అయొడిన్ లోపం ప్రధాన లక్షణం మెడ వాపు. థైరాయిడ్ గ్రంథి వాపు ద్వారా ఈ లోపం బయల్పడుతుంది.
డిప్రెషన్ : మానసిక కుంగుబాటు, యాంగ్జయిటీలు కూడా అయొడిన్ లోపం లక్షణాలే!
ఆహారంతో : అయొడిన్ లోపాన్ని అయొడిన్ కలిగి ఉండే ఉప్పుతో సరిదిద్దుకోవచ్చు. హైపోథైరాయిడ్ జీవనశైలి సమస్య కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో థైరాయిడ్ హార్మోన్‌ను మాత్రల రూపంలో తీసుకుంటూ ఉండాలి.