శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2025 (09:25 IST)

తిరుపతిలో తోపులాట - ఆరుగురు మృతి : సెక్యూరిటీ లోపం వల్లే...

stampade
తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ దర్శనాల కోసం తిరుపతి, తిరుమలలో రేపటి నుంచి టోకెన్ల జారీకి తితిదే ఏర్పాట్లు చేసింది. అయితే, భక్తులు ముందుగానే టోకెన్ జారీ కేంద్రాల వద్దకు భారీగా తరలివచ్చారు. 
 
ఈ క్రమంలో తిరుపతిలో శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం వద్ద ఉన్న టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య భారీగా తోపులాట చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు సొమ్ముసిల్లి పడిపోవడంతో వారిని తిరుపతిలోనే రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్టు గుర్తించారు. 
 
ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఘటన స్థలాలకు చేరుకుని పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. వైకుంఠ ద ్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్దకు అదనపు పోలీస్ బలగాలను తరలించారు.