శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 ఫిబ్రవరి 2021 (16:10 IST)

Tirupati Zoo Park: పాముకి ఆహారం వేస్తూ దాని కాటుకే బలైన మహిళ

తిరుపతి జూ పార్కులో జంతు సంరక్షురాలిగా విధులు నిర్వహిస్తున్న విజయమ్మ అనే మహిళ పాము కాటుకు బలైంది. పాములకు ఆహారం వేస్తున్న క్రమంలో ఓ పాము ఆమెని కాటు వేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
 
వివరాలలోకి వెళితే.. తిరుపతి జూ పార్కులో గత కొన్నేళ్లుగా విజయమ్మ జంతు సంరక్షుకురాలిగా పనిచేస్తోంది. ఉదయాన్నే జూ పార్కులో వున్న పక్షులు, పాములు ఇతర చిరు జంతువులకు ఆహారం వేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె సోమవారం నాడు పాములకు ఆహారం వేసేందుకు వెళ్లింది. ఆహారం వేస్తున్న సమయంలో ఓ పాము ఆమెను కాటు వేసింది.
 
దీనితో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స తీసుకుంటూ వున్న విజయమ్మ గురువారం నాడు కన్నుమూసింది. దీనితో విషాదం నెలకొంది. జూ పార్కులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఐతే ఆమెను పాము ఎలా కాటు వేసిందన్నది విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.