మంగళవారం, 31 జనవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 6 అక్టోబరు 2022 (11:52 IST)

కర్రల సమరం.. బన్నీ ఉత్సవం.. యువకుడు మృతి

Bunny Utsav
Bunny Utsav
కర్రల సమరం.. బన్నీ ఉత్సవంగా పేరున్న కర్నూలు జిల్లా దేవరగట్టు ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ సమరాన్ని చూసేందుకు వచ్చిన ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు రవీంద్రనాథ్‌ రెడ్డిగా గుర్తించారు. ఈ కర్రల సమరంలో 50మందికి పైగా గాయాలైనాయి. 
 
మృతి చెందిన వ్యక్తికి గుండెపోటు వచ్చినట్లు భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని స్వస్థలం కర్ణాటకలోని శిరుగుప్పగా గుర్తించామని తెలిపారు. కర్రల సమరంలో పలువురు తలలు పగిలాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. 
 
ప్రతీ ఏటా దసరా సందర్భంగా నిర్వహించే రథోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే బన్నీ ఉత్సవాలనే కర్రల సమరంగా పేర్కొంటారు.