శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (09:22 IST)

పది 5జీ ఫోన్లపై సూపర్ ఆఫర్లు.. రూ.600 కడితే చాలు

smartphone
ఫ్లిప్‌కార్ట్, అమేజాన్‌లో పది 5జీ ఫోన్లపై సూపర్ ఆఫర్లు వచ్చాయి. నెలకు రూ.600 కడితే చాలు ఫోన్ మీ సొంతం అవుతుంది. కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఈఎంఐ రూపంలో సులభంగానే నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ.1000 కన్నా తక్కువనే పెట్టుకోవచ్చు.
 
రెడ్‌మి 11 ప్రైమ్ 5జీ ఫోన్‌ను చౌక ఈఎంఐతో ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ ఫోన్‌పై ఈఎంఐ రూ. 621 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ఫోన్‌లో 4జీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 12,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్లు కలుపుకుంటే ఇంకా తక్కువ రేటుకే ఫోన్ వస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 12,300 వరకు తగ్గింపు పొందొచ్చు.
 
రియల్‌మి నార్జో 50 5జీ ఫోన్‌పై కూడా ఈఎంఐ ఆఫర్ ఉంది. దీనిపై ఈఎంఐ రూ. 669 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ఫోన్ ధర రూ. 12,999. 4జీ ర్యామ్‌ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఈ ఫోన్‌పై కూడా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్ వంటివి ఉన్నాయి.