శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (10:15 IST)

సర్వదర్శనం టోకెన్లు అక్కర్లేదు.. టీటీడీ కీలక నిర్ణయం

venkateswara swamy
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్ల కోసం సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కూడా రెండు రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.
 
ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆది, సోమవారాల్లో టోకెన్ల జారీ ప్రక్రియని టీటీడీ తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో టోకెన్లు తీసుకున్న భక్తులు రెండు రోజుల పాటు తిరుపతిలో వేచి ఉండాల్సిన పరిస్ధితి ఏర్పడింది. 
 
మరోవైపు సర్వదర్శనం టోకెన్ల కోసం సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కూడా రెండు రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. 
 
భక్తులు భారీస్థాయిలో తరలిరావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. బుధవారం నుంచి ఆదివారం వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 
 
టోకెన్లు లేకుండానే శ్రీవారి సర్వదర్శనానికి అనుమతిస్తోంది. అలిపిరి నుంచి దర్శన టోకెన్లు లేకుండానే భక్తులను అనుమతిస్తోంది. రెండేళ్ల తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి భక్తులను అనుమతిస్తోంది.