శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (16:27 IST)

టీటీడీ సంచలన నిర్ణయం.. సర్వదర్శనానికి ఆధార్ చూపిస్తే చాలు: బుచ్చయ్య ఏమంటున్నారో చూడండి

venkateswara swamy
సర్వదర్శనం కోసం ఇక టోకెన్లు అవసరం లేదు.. ఆధార్ చూపిస్తే చాలు.. అంటోంది టీటీడీ. కలియుగ వైకుంఠం సర్వదర్శనం టోకెన్ల కోసం జనం భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైనాయి. ఈ నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తోంది. భక్తులు ఆధారా కార్డ్ చూపించి సర్వ దర్శనానికి వెళ్ళిపోవచ్చని టీటీడీ ప్రకటించింది. 
 
మంగళవారం రోజు విడుదల చేసే సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్దవేల సంఖ్యలో భక్తులు వచ్చారు. 
 
ఇనుప కంచెను తోసుకుని లోనికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలోనే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసి భక్తులను దర్శనానికి తితిదే అనుమతించింది.