బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (11:20 IST)

తిరుమలో సర్వదర్శనం టోకెన్లకు ఎగబడిన భక్తులు...

devotees
తిరుమలలో భక్తుల తోపులాట జరిగింది. సర్వదర్శన టిక్కెట్ల కోసం భక్తులు ఎగబడ్డారు. దీంతో ఈ తోపులాట సంభవించింది. గత రెండు రోజులుగా టోకెన్ల పంపిణీని నిలిపివేశారు. దీంతో ఈ టోకన్ల కోసం భక్తులు తమ చంటి బిడ్డలతో కలిసి క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే, ఒక్కసారిగా భక్తులు టోకెన్లకు ఎగబడటంతో తోపులాట జరిగింది. 
 
రెండు రోజుల విరామం తర్వాత తిరుపతిలోని గోవిందరాజ స్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లను భక్తులు పంపిణీ చేశారు. అయితే గోవిందరాజస్వామి సత్రం వద్ద వేచివున్న భక్తులు ఒక్కసారిగా తరలిరావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ముగ్గురు భక్తులు గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 
 
తితిదే విజిలెన్స్, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా భక్తులను నిలువరించలేకపోయారు. మరోవైుపు తోపులాటలో గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరిలంచారు. ఈ సర్వదర్శన టోకెన్లను అధిక ధరకు తితిదే అధికారులు, సిబ్బంది బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.