తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం 70వేల మంది..
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ స్థాయిలో భక్తులు తిరుమల కొండకు తరలివస్తున్నారు. బుధవారం శ్రీవారిని 70వేల మంది దర్శించుకున్నారు.
అలాగే సోమవారం తిరుమల శ్రీవారిని 66,112 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.64 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఇకపోతే, ఏప్రిల్ 7న భక్తుల రద్దీ ఎక్కువగా వున్నందున టీటీడీ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. సర్వదర్శనం, ప్రత్యేక దర్శనాలకు మూడు గంటల సమయం పడుతోంది. ఇంకా వారాంతంలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం వుందని టీటీడీ అంచనా వేస్తోంది.