మంగళవారం, 16 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (14:48 IST)

శ్రీవారి సేవలో ఒకేసారి ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు

శ్రీవారిని టాలీవుడ్ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాత బండ్ల గణేష్, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల ఆలయానికి వెళ్ళారు. అక్కడ శ్రీవారి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
 
ఒకేసారి ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించడం విశేషం. అయితే అక్కడ ఉన్న భక్తులు వీరితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వీరికి సంబంధించి ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 
K. Raghavendra Rao
 
కాగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇటీవల విడుదలైన "పెళ్లి సందడి" సినిమాకు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడమే కాకుండా సినిమాలో మెరిశారు. 
 
ఇక సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా "సేనాపతి" అంటూ ఓటిటిలో, "సూపర్ మచ్చి" సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. 
 
ఇక "మహానటి" సినిమాలో యువ సావిత్రి పాత్రను పోషించిన రాజేంద్ర ప్రసాద్ మనవరాలు తేజశ్విని కూడా తిరుమలలో కన్పించింది. 
Bandla Ganesh
 
మరోవైపు నిర్మాత బండ్ల గణేష్ తన కుటుంబ సభ్యులతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.