శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (13:58 IST)

మల్లేశ్వర స్వామి ఆలయ క్యాంటీన్‌లో చికెన్ వంటకాల తయారీ

temple - non veg
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా పార్టీ నేతలు అంతా నా ఇష్టం అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఆలయాలను కూడా అపవిత్రం చేస్తున్నారు. ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అనేక హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి, పలు ఆలయాల రథాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. తాజాగా మరో అపచారం జరిగింది. 
 
గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వర స్వామి ఆలయ ఆవరణలో క్యాంటీన్ నిర్వాహకులు మాంసాహారం వండడంతో భక్తులు, ఆలయ అధికారుల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటనను ఓ భక్తుడు తన మొబైల్ కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
క్యాంటీన్‌లో భక్తులకు టిఫిన్, టీ, అన్నదాన ప్రసాదాలు అందజేసేవారని, అయితే క్యాంటీన్‌లో మాంసాహార వంటకాలు వండారని, ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని సమాచారం. స్థానిక వైకాపా నేత నుంచి వంటకాల తయారీకి భారీ ఆర్డర్ రావడంతో ఆలయ క్యాంటీన్ యజమాని ఏకంగా ఆలయ క్యాంటీన్‌లోనే ఈ మాంసాహార వంటకాలు తయారు చేసి సరఫరా చేయడం గమనార్హం.