శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (11:56 IST)

గుంటూరులో వైకాపా వర్సెస్ టీడీపీ కొట్లాట - 17 మందికి గాయాలు

tdp - ycp
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణాత్మక వైఖరి పెరిగిపోతోంది. ఫలితంగా ఇరు పార్టీల మధ్య కక్షలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య నిత్యం ఏదో ప్రాంతంలో గొడవులు జరుగుతూనే ఉన్నాయి. 
 
తాజాగా గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో వైకాపా, టీడీపీ కార్యకర్తలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు వర్గాల వారిలో కొందరు గాయపడ్డారు. ఇటీవలే కారుమంచిలో తిరునాళ్లు జరిగాయి. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తుంది. తాజాగా ఆ వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. 
 
ఈ ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరు వర్గాల వారిని అదుపు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కొట్లాటలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.