ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులు.. దూరంగా నిల్చోమన్న మాజీ మంత్రి రోజా!! Video Viral

rk roja
వైకాపా మహిళా నేత, మాజీ మంత్రి, సినీ నటి ఆర్కే రోజా పారిశుద్ధ్య కార్మికులను కించపరిచేలా నడుచుకున్నారు. తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన మహిళా పారిశుద్ధ్య కార్మికులను దూరంగా ఉండాలంటూ చేయితో సంజ్ఞ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
మాజీ మంత్రి ఆర్కే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రోజా తన భర్త, సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణితో కలిసి వరుషాభిషేకంలో పాల్గొన్నారు. 
 
ఆ సమయంలో రోజాతో పలువురు భక్తులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు మహిళా పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ కోసం రోజా వద్దకు వెళ్లగా వారిని దూరంగా నిల్చోవాలని చేయి చూపిస్తూ రోజా చెప్పడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో వారు కొంత దూరం జరిగి ఆమెతో సెల్ఫీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.