బుధవారం, 18 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 జులై 2024 (10:12 IST)

జేఎన్టీయూహెచ్‌ హాస్టల్‌లో ఆహారాన్ని పిల్లులు ఆరగిస్తున్నాయి... Video Viral

cat
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాయం ఒకటి. హైదరాబాద్ నగరంలో ఉంది. ఈ యూనివర్శిటీకి చెందిన హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు వడ్డించే ఆహారం అత్యంత నాసికరకంగా ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. పైగా, గత కొన్ని రోజులుగా హాస్టల్‌లో తయారు చేసే ఆహార పదార్థాలు, కూరల్లో ఎలుకలు, బొద్దింకలు కనిపిస్తున్నాయి. తాజాగా విద్యార్థుల కోసం తయారు చేసిన ఆహారాన్ని పిల్లులు ఆరగిస్తున్నాయి.
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల హాస్టల్‌లో తయారు చేసిన కూరలో చిట్టెలుకలు సంచరించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై జేఎన్టీయూ ఉన్నతాధికారులను హెచ్చరించారు. అయినప్పటికీ వారి తీరు మారలేదు. తాజాగా జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ హాస్టల్లో విద్యార్థులకు పెట్టే ఆహారాన్ని పిల్లులు ఆరగిస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.