శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 జులై 2024 (09:36 IST)

బీజేపీ టైటానిక్ షిప్‌లా మునిగిపోవాలంటే మోడీని కొనసాగించాల్సిందే : స్వామి

subramanya swami
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యాలు ఛేశారు. ఇటీవల దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పైచేయి సాధించింది. బీజేపీ రెండో స్థానంతో సరిపుచ్చుకుంది. ఈ ఫలితాలపై డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. 
 
భారతీయ జనతా పార్టీలో మనం, మన పార్టీ టైటానిక్ షిప్‌ తరహాలో మునిగిపోవాలని కోరుకుంటే, అందుకు సారథ్యం వహించడానికి ప్రధాని నరేంద్ర మోడీయే ఉత్తమమైనవారు. బీజేపీ శాశ్వతంగా మునిగిపోయేలా బీటలు వారుతుందని ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఇండియా కూటమి పదిచోట్ల గెలిచింది. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇందులో ఎక్కువ సీట్లు ఇండియా కూటమి అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఉన్నాయి.