బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (17:04 IST)

నా భర్త శ్రీరామచంద్రుడు కాదంటున్న వనితా రెడ్డి .. సెల్ఫీ వీడియో

తన భర్త శ్రీరామచంద్రుడేంకాదనీ, ఆయనకు పలువురు అమ్మాయిలతో అక్రమసంబంధాలు ఉన్నాయని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కమెడియన్ విజయ్ సాయి భార్య వనితా రెడ్డి ఆరోపిస్తోంది.

తన భర్త శ్రీరామచంద్రుడేంకాదనీ, ఆయనకు పలువురు అమ్మాయిలతో అక్రమసంబంధాలు ఉన్నాయని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కమెడియన్ విజయ్ సాయి భార్య వనితా రెడ్డి ఆరోపిస్తోంది. మూడేళ్ళుగా తనకు దూరంగా ఉంటున్న విజయ్.. తన వల్ల ఇపుడు ఆత్మహత్య చేసుకోవడం ఏమిటని ఆమె ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా, ప్రతి ఒక్కరూ తన భర్త చావుకు తానే కారణమని నిందలు మోపుతున్నారనీ, ఇది వాస్తవం కాదన్నారు. 
 
ఆయనకు అనేక మందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయనీ, వాటిలో రెండు క్లిప్పింగ్స్‌ను మాత్రమే ఇపుడు రిలీజ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. మరిన్ని ఆధారలతో పోలీసులకు లొంగిపోతానని, తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేసింది. వనితా రెడ్డి శనివారం పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోను మీరూ వినండి.