శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (16:10 IST)

పరాయి పురుషుడుతో అసభ్య చాటింగ్.. భార్య బాగోతం చూసి నిశ్చేష్టుడైన భర్త...

కట్టుకున్న భార్య పరాయి పురుషుడితో అసభ్యంగా చాటింగ్ చేయడాన్ని భర్త కనిపెట్టాడు. ఆ తర్వాత ఆమె ఫోన్ తీసుకుని చూసి నిశ్చేష్టుడయ్యాడు. చివరకు భార్యతో చాటింగ్ చేసిన వ్యక్తిని తన స్నేహితులతో కలిసి చంపేసి ఇపు

కట్టుకున్న భార్య పరాయి పురుషుడితో అసభ్యంగా చాటింగ్ చేయడాన్ని భర్త కనిపెట్టాడు. ఆ తర్వాత ఆమె ఫోన్ తీసుకుని చూసి నిశ్చేష్టుడయ్యాడు. చివరకు భార్యతో చాటింగ్ చేసిన వ్యక్తిని తన స్నేహితులతో కలిసి చంపేసి ఇపుడు జైలుపాలయ్యాడు. విజయవాడలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
విజయవాడ, కృష్ణలంక బియ్యపుకొట్టు బజారుకు చెందిన లంకా నాగ వెంకట సీతారామాంజనేయ శర్మ అనే వ్యక్తి బాలాజీనగర్‌లో ఉన్న పాత ఆంజనేయస్వామి ఆలయం వద్ద పౌరోహిత్యం చేస్తున్నాడు. ఈయన అదే ఆలయానికి వచ్చి వెళ్లే మౌనిక అనే వివాహితకు కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను పంపాడు. దీనికి ఆమె ఓకే చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. 
 
నిజానికి మౌనికకు నాలుగేళ్ల క్రితమే సాయి శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, మౌనికకు పూజారితో ఏర్పడిన పరిచయం ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకునే వరకు వెళ్లింది. ఆ తర్వాత వారిద్దరూ వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో చాటింగ్‌‌లు చేసుకోవడం, ఫొటోలను షేర్ చేసుకోసాగారు. 
 
ఈ క్రమంలో భార్య మౌనిక ప్రవర్తనలో మార్పురావడాన్ని భర్త సాయి శ్రీనివాస్ గమనించాడు. ఆ తర్వాత భార్యకు తెలియకుండానే ఆమె మొబైల్ ఫోన్ తీసి చూశాడు. అందులో సీతారామాంజనేయ శర్మతో చేసిన చాటింగ్‌ల బాగోతం బయటపడింది. ఆమె మొబైల్‌లో ఉన్న అసభ్యకరమైన ఫొటోలు, సందేశాలను కూడా చూశాడు. 
 
దీంతో తన భార్యను ట్రాప్‌ చేసిన సీతారామాంజనేయ శర్మకు చంపాలని ప్లాన్ వేశాడు. ఇందులోభాగంగా, శర్మకు ఫోన్‌ చేసిన సాయి శ్రీనివాస్‌ 'రేపు (15వ తేదీ) ఉదయం ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌కు రా. లేకపోతే ఇంటికొచ్చి పరువు తీసేస్తా' అంటూ బెదిరించాడు. దీంతో రామాంజనేయ శర్మ 15వ తేదీ రాగా, సాయి శ్రీనివాస్‌తో పాటు అతని స్నేహితులు చితకబాది చంపేశారు. మృతదేహాన్ని జాతీయ రహదారికి పక్కన పడేశారు. 
 
అయితే, భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో శర్మ భార్య స్వరూప కృష్ణలంక పోలీసులను ఆశ్రయించింది. ఎవరో అమ్మాయితో చాటింగ్‌ చేస్తున్నాడని, ఆమె భర్తే ఏదో ఒకటి చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. చివరికి అదే నిజమైంది. 16వ తేదీన ఈ మృతదేహాన్ని గుర్తు తెలియనిదిగా గన్నవరం పోలీసులు గుర్తించారు. 
 
ఆ తర్వాత శర్మ కాల్‌డేటాను విశ్లేషించి, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి మౌనిక భర్త సాయిశ్రీనివాస్‌తోపాటు డాకారపు సాయిశ్రీనివాస్‌, మెహ్మద్‌ సర్వర్‌, తమ్మిన విజయ బాబు, లక్కసాని సతీష్‌, షేక్‌ ఫరూఖ్‌లను అరెస్టు చేశారు.