'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ నిన్న శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకున్నది. ఈ నేపధ్యంలో ఇప్పటికే దర్శకుడు శంకర్ ఇక హిట్ సినిమాలు చేయలేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా వుండగానే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసారు.
ఈ సెలబ్రేషన్స్ ఎందుకుంటే... ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పుట్టినరోజు కావడంతో ఆయన తనయుడైన అల్లు అర్జున్ ఇంకా కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి విషెస్ చెప్పారు. ఐతే ఆ కేక్ పైన పుష్ప కా బాప్ అంటూ హ్యాండ్ సింబల్ పెట్టడంతో చెర్రీ ఫ్యాన్స్ కొందరు విమర్శిస్తున్నారు. మా హీరోను బన్నీ వెక్కిరిస్తూ ఇలాంటి కేక్ కట్ చేసారంటూ కామెంట్లు చేస్తున్నారు.