గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2024 (10:46 IST)

కృష్ణా బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన పడవలు... ఘటనపై ఫిర్యాదు.. కేసు నమోదు

prakasam barrage boat accident
కృష్ణా బ్యారేజీ గేట్లను రెండు మూడు పడవలు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఓ గేట్ కూడా స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనపై ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల ఒకటో తేదీన కృష్ణా నదికి భారీ వరద సంభవించింది. ఈ వరదలో కొట్టుకొచ్చిన పడవలు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. ఒకేసారి నాలుగు పడవలు బ్యారేజ్ వద్దకు వచ్చి గేట్లను ఢీకొనడంపై ఇరిగేషన్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. 
 
ఈ నెల 1న కృష్ణానదికి భారీగా వరద వచ్చింది. ఆ తెల్లవారుజామున మూడు భారీ మర పడవలు, ఒక చిన్న పడవ కృష్ణానదిలో ఎగువ నుండి కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టాయి. దీంతో రెండు గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. ఒకేసారి నాలుగు పడవలు రావడంపై ఇరిగేషన్ అధికారులకు అనుమానాలు రేకెత్తాయి. 
 
నాలుగు మర పడవలు బ్యారేజి గేటును ఢీ కొట్టడం వెనుక కుట్ర కోణం ఉందేమోనని ఇరిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ శుక్రవారం విజయవాడ ఒకటో పట్టణ పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బ్యారేజ్‌ని పడవలు ఢీ కొట్టిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.