బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (08:13 IST)

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు.. అధికారులు అప్రమత్తం

prakasam barriege
ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 7,24,976 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, ముందుజాగ్రత్త చర్యగా నీటిపారుదల శాఖ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు బ్యారేజీ 70 క్రెస్ట్ గేట్లను ఎత్తివేసి వరద నీటిని విడుదల చేశారు. 
 
బ్యారేజీకి ఇన్ ఫ్లో 11,40,000 క్యూసెక్కుల నుంచి 7,24,976 క్యూసెక్కులకు తగ్గింది. నాగార్జున సాగర్ జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం రిజర్వాయర్‌లో వరద నీటి మట్టం 300.83 టీఎంసీలకు చేరింది. 
 
జలాశయంలోకి 4,08,648 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో అధికారులు దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటిమట్టం 41.59 టీఎంసీలకు చేరింది. 
 
మరోవైపు బ్యారేజీలోకి భారీగా వరదనీరు చేరుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది.