గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (15:05 IST)

ఏపీలో అధిక వర్షపాతం.. నీటితో కళకళలాడుతున్న 108 రిజర్వాయర్లు

Nagarjuna Sagar
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ - జూలై నెలల్లో అధిక వర్షపాతం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 108 రిజర్వాయర్లు గురువారం నాటికి వాటి నిల్వ సామర్థ్యంలో 67 శాతం వరకు నిండిపోయాయి. వివిధ డ్యామ్‌ల నుండి నీటిని విడుదల చేయడానికి అధికారులను ఆదేశించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 1 నుండి జూలై 31 వరకు అధిక వర్షపాతం నమోదైంది. ఇంకా, ఆగస్టులో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
 
ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో బ్యారేజీకిలో వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ 2,88,191 క్యూసెక్కులుగా ఉంది. కాలువలకు ‌13,991 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
 
ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.