గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (08:10 IST)

రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై వుంచిన వైకాపా సర్కారు.. ఏపీ సీఎం ఫైర్

babu cbn
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై ఉంచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీ అనే వ్యవస్థ లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నిర్లక్ష్య వైఖరి, బుడమేరు కాలువ మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే ప్రస్తుత వరద సంక్షోభానికి కారణమన్నారు. 
 
నగరానికి వరద ముప్పు.. అగ్నిమాపక సేవలను వినియోగిస్తున్న ప్రజల ఇళ్లు, వాహనాలను శుభ్రపరిచేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వాహనాలకు బీమా కల్పించేందుకు బ్యాంకర్లు, బీమా కంపెనీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 
 
వరద నీరు తగ్గిన వెంటనే పంట నష్టాల లెక్కింపు చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారు. బుధవారం సాయంత్రంలోగా ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యేందుకు తాను జేసీబీలో ప్రయాణించానని చెప్పారు.