ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:19 IST)

రిషికపూర్ మృతికి విజయ్‌చందర్ సంతాపం

సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు రిషిక‌పూర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది సంస్థ   చైర్మన్ టి.ఎస్.విజయ్‌చందర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మేరా నామ్‌ జోకర్‌ చిత్రంలో బాల నటుడుగా, ‘బాబీ’ చిత్రంతో హీరోగా సినీ ప్రస్థానం  ప్రారంభించిన రిషికపూర్ మరణంతో సినీ ప్రపంచం గొప్ప దిగ్గజాన్ని కోల్పోయిందని విజయ్‌చందర్ అన్నారు.

తొలి చిత్రంతోనే బాల నటుడిగా జాతీయ పురస్కారం పొందిన రిషికపూర్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయ‌న పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి విజయ్‌చందర్ ప్రగఢ సానుభూతి వ్యక్తం చేశారు. 
 
సినీ చరిత్రలో చిరస్మరణీయుడు: 
రిషికపూర్ మరణం సినీరంగానికి తీరని లోటని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

బాలీవుడ్‌లో మేరా నామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్‌, పతీపత్నీఔర్ ఓ.., కర్జ్‌, కూలీ, దునియా, నగీనా.. వంటి అనేక హిట్ సినిమాలలో నటించిన రిషి కపూర్ నటనా నైపుణ్యం దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిందని ఆయన అన్నారు. రిషికపూర్ కుటుంబానికి విజయ్‌కుమార్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.