మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (20:55 IST)

రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు చేపట్టండి: సీపీఐ

మే 4న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మౌన దీక్షలూ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. కరోనా లాక్‌డౌన్ కష్టాలు పేద, సామాన్య ప్రజానీకాన్ని, వలస కూలీలు, భవన నిర్మాణ, గ్రామీణ కార్మికుల్ని పలు ఇబ్బందులకు గురి చేశాయన్నారు.

లాక్ డౌన్ వల్ల నష్టపోయిన రైతులు, చిరు వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వలస కార్మికులందరినీ స్వస్థలాలకు చేర్చాలన్నారు.

ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం, 50 కేజీల గోధుమలు, రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ మే 4న అన్ని మౌన దీక్షలు చేపడుతున్నామని రామకృష్ణ వెల్లడించారు.