మంగళవారం, 13 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 17 మార్చి 2020 (07:35 IST)

ఈసీకి కులాన్ని అంటగట్టడం సిగ్గుచేటు: సీపీఐ

ఎన్నికల కమిషనర్‌కు కులాన్ని అంటగట్టడం సిగ్గుచేటని సీపీఐ నేత రామకృష్ణ తప్పుబట్టారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని గతంలోనే సీపీఐ కోరిందని గుర్తుచేశారు.

ఎన్నికల్లో మంత్రులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మాచర్ల, చిత్తూరు ఘటనలు చూసి సీఎం జగన్ సిగ్గుపడాలన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారంటూ ఎస్‌ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని, డీజీపీని నువ్వు నియమించావని, ఆయన చేస్తున్న పనులకు నీవు బాధ్యుడివి కాదా? అని జగన్‌ను రామకృష్ణ ప్రశ్నించారు. నీ వల్ల డీజీపీ రెండు సార్లు హైకోర్టు బోనెక్కారని రామకృష్ణ గుర్తుచేశారు.