ఈసీపై జగన్‌కు ఐవైఆర్ కౌంటర్  
                                       
                  
                  				  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ చేసిన ఆరోపణలను మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు ఖండించారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు.
				  											
																													
									  151 సీట్లు వచ్చినా, 175 సీట్లు వచ్చినా రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రభుత్వ విధానంలో ముఖ్యమంత్రి అధికారాలకు పరిమితులుంటాయనే మౌలిక సత్యాన్ని ముఖ్యమంత్రి గ్రహిస్తే మంచిదని కౌంటర్ ఇచ్చారు.
				  ఎన్నికల ప్రక్రియ కొనసాగినంత కాలం ఇండ్ల స్థలాల పంపిణీ లాంటి అంశాలను నిలిపివేసే పూర్తి అధికారాలు, హేతుబద్ధమైన కారణాల మూలంగా ఎన్నికలను వాయిదా వేసే అధికారాలు కూడా ఎన్నికల సంఘానికి ఉన్నాయన్నారు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  రాజ్యాంగబద్ధమైన సంస్థలపై విపరీత ఆరోపణలు చేసే ముందు కొంత ఆలోచించడం ఎందుకైనా మంచిదని సూచించారు.  అయితే.. ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందనే నిర్ణయం సమంజసం కాకపోవచ్చని వ్యాఖ్యానించారు.
				  																		
											
									  వాయిదా మూడు, నాలుగు నెలలైతే ప్రభుత్వం అప్పటిదాకా సుప్తచేతనావస్థలో ఉండాలనటం కూడా సరికాదన్నారు. కోడ్‌ను ఉపసంహరించి తిరిగి ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి ప్రవేశ పెడితే సరిపోతుందన్నారు.