బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:09 IST)

వెహికల్ ట్యాక్స్‌పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం

వెహికల్ ట్యాక్స్‌లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెహికల్ ట్యాక్స్ చెల్లింపుల గడువును జూన్ 30వ తేదీ వరకూ పొడిగించింది.

వాస్తవానికి ఏప్రిల్ 30వ తేదీ నాటికి వెహికల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే దీన్ని మూడు నెలలు పొడిగిస్తు 
వెహికల్ ట్యాక్స్‌లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెహికల్ ట్యాక్స్ చెల్లింపుల గడువును జూన్ 30వ తేదీ వరకూ పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 30వ తేదీ నాటికి వెహికల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది.

అయితే దీన్ని మూడు నెలలు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌తో ప్రజలకు ఆదాయం లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వాస్తవానికి వెహికల్ పన్నును అడ్వాన్స్‌గా చెల్లిస్తారు. ప్రతీ త్రైమాసికానికి చెల్లింపులు ఉంటాయి.

ఒకవేళ సక్రమంగా ట్యాక్స్ చెల్లించకపోతే 50 శాతం నుంచి 200 శాతం వరకూ జరిమానాలు ఉంటాయి. అయితే ప్రభుత్వం గడువును పొడిగిస్తూ కొంచెం ఊరటను కల్పించింది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నెలకొనడంతో ఎక్కడికక్కడ సరుకు రవాణా లారీలు నిలిచిపోయాయి.

దీంతో ట్యాక్ష్ చెల్లింపుల విషయంలో వెలుసుబాటును కల్పించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ కోరడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.