ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జూన్ 2024 (10:32 IST)

కొడాలి నాని ఓటమిని జీర్ణించుకోలేక వాలంటీర్ ఆత్మహత్య

kodali nani
ఏపీలో ఎన్డీయే కూటమి చేతిలో ఘోర పరాజయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు, మద్దతుదారులు అంగీకరించారు. వైకాపా పార్టీ తరపున పోటీలో ఓడిపోయిన వారందరిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వున్నారు. 
 
50000 ఓట్ల తేడాతో టీడీపీ నాయకుడు వెలిగండ్ల రాము చేతిలో చిత్తుగా ఓడిపోయారు. నాని ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా తరచూ టీడీపీ నేతలను దూకుడుగా తిట్టేవారు.
 
ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ పార్టీ కేడర్‌ ఉలిక్కిపడింది. తాజాగా కొడాలినాని ఓటమిని భరించలేక ఓ వాలంటీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
కొడాలి నాని ఓటమి వార్తను జీర్ణించుకోలేక పిట్ట అనిల్ అనే వాలంటీర్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అనిల్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వాలంటీర్‌గా పనిచేశాడు. ఇతను గుడివాడ రూరల్ సెగ్మెంట్‌లోని సైదేపూడి గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.