శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2017 (11:00 IST)

ఆమ్రపాలికి కేసీఆర్ వార్నింగ్.. చీరకట్టుతో కనిపించారు.. ఎక్కడ?

తెలంగాణలో యూత్ ఐకాన్‌గా మారిపోయిన వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి.. యువతకు మార్గదర్శకంగా నిలిచారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పాటు ఏపీలో కూడా చాలామంది అభిమానులు ఆమె సొంతం. సోష‌ల్ మీడియాలో ఆమెకు అదిరిపోయ

తెలంగాణలో యూత్ ఐకాన్‌గా మారిపోయిన వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి.. యువతకు మార్గదర్శకంగా నిలిచారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పాటు ఏపీలో కూడా చాలామంది అభిమానులు ఆమె సొంతం. సోష‌ల్ మీడియాలో ఆమెకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమ్రపాలి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందుకు ఆమె డ్రెస్ కోడే కారణమైంది. 
 
ఆమ్ర‌పాలి డ్రెస్ కోడ్ గురించి ఆమెకు జ‌న‌ర‌ల్ మెసేజ్‌లాగానే కేసీఆర్ చిన్న‌పాటి వార్నింగ్ ఇచ్చార‌ట‌. కేసీఆర్ డైలాగ్ త‌న‌కే అని భావించిన ఆమె బాధ‌ప‌డింద‌ట‌. తెలంగాణ‌లో చేనేత వ‌స్త్రాల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం త‌ర‌పున బాగా కృషి చేస్తున్నారు. హీరోయిన్ స‌మంత‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో జీన్స్, టీషర్టులను పక్కనబెట్టి చేనేత వస్త్రాలను ధరిస్తే మంచిదని.. తద్వారా కలెక్టర్‌కు మరింత హుందాతనం పెరుగుతుందని సూచించారట. 
 
ఆమ్ర‌పాలి డ్రెస్ కోడ్ చూస్తే ఆధునిక‌త‌కు ద‌గ్గ‌రిగా ఉంటుంది. జీన్స్‌, టీ ష‌ర్ట్స్‌, షార్ట్ క‌ట్స్ డ్రెస్సెస్ ఆమె ఎక్కువుగా వేసుకుంటుంటారు. అయితే కేసీఆర్ ఇలా వార్నింగ్ ఇవ్వడంతో కాస్త బాధపడిన ఆమ్రపాలి..  71వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ, తన డ్రస్సింగ్ స్టయిల్‌ను మార్చేసుకున్నారు. కేసీఆర్ వార్నింగ్ ప్రభావంతో, నిన్నటి వేడుకల్లో పొడవు చేతులతో నిండుగా చీరకట్టుతో ఆమ్రపాలి హాజరయ్యారు.