సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (10:58 IST)

30 నుంచి హనుమ జన్మక్షేత్రంపై వెబినార్‌

హనుమంతుడి జన్మక్షేత్రంపై ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30, 31 తేదీల్లో తిరుపతిలో వెబినార్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ వెబినార్‌లో ఆంజనేయుడి జన్మస్థలానికి సంబంధించిన పురాణాల్లో ప్రమాణికత, వేంకటాచల మహాత్యం ప్రామాణికత, తిరుమల ఇతిహాసం, తిరుమలతో ఆంజనేయుడికి ఉన్నపురాణ సంబంధ అంశాలు, శ్రీ వేంకటేశ్వర ఇతిహాసమాల ప్రాశస్త్యం వంటి అంశాలు ఉంటాయి.

వీటితో పాటు హనుమంతుడి జన్మస్థలం, వాఙ్మయ ప్రమాణాలు, సంస్కృత వాఙ్మయం హనుమంతుడు, వైష్ణవ సాహిత్యంలో తిరుమల, శాసన ప్రమాణాలు, భౌగోళిక ప్రమాణాలు ఇతర అంశాలపై వెబినార్‌ నిర్వహిస్తారు. ఈ వెబినార్‌లో మఠాధిపతులు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఉన్నతస్థాయి పరిశోధకులు పాల్గొంటారు.