బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మే 2020 (20:44 IST)

కన్నకూతురిని కోరిక తీర్చమని చిత్రహింసలు

కన్నకూతురిని కోరిక తీర్చమని చిత్రహింసలు పెట్టిన కన్నతండ్రి.. కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పదో వార్డులో నివాసముంటున్న లక్ష్మీనారాయణ తాపీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతని భార్య కూలీ పనులుకు వెళ్తుతుంది. వారికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. 
 
మిగిలి ముగ్గురమ్మాయిలో ఇంటి వద్దే ఉంటున్నారు. మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ.. రెండో కూతుర్ని వేధింపులకు గురిచేశాడు. తన కోరిక తీర్చమని చిత్రహింసలు పెట్టాడు. ఇంకా లక్ష్మీ నారాయణ పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. 
 
ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురును చూసి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా కేక పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో వున్న తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.