శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మే 2020 (12:21 IST)

ప్రేమ పేరుతో యువకుడి మోసం.. గర్భవతిని చేసి ముఖం చాటేశాడు..

ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడు. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమిస్తున్నానని చెప్పి గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి కులం ప్రస్తావన తెచ్చాడు. కులాలు వేరని పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
 
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కాట్న మహేందర్‌ (28), అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం పెట్టుకున్నాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఏడాదిగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. 
 
యువతికి మాయమాటలు చెప్పిన యువకుడు శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. అతడిని పూర్తిగా నమ్మిన యువతి బాగా దగ్గైంది. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని అమ్మాయి పట్టుబట్టింది. దీంతో యువకుడు ముఖం చాటేశాడు.  
 
డబ్బులిచ్చి అమ్మాయిని వదిలించుకోవాలని చూశాడు. బాధితురాలు మాత్రం లొంగలేదు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అయితే అమ్మాయికి సంబంధించి కచ్చితమైన వయసు నిర్ధారణ కాకపోవడంతో ప్రస్తుతం అత్యాచారం, మోసం సెక్షన్ల కింద యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.