శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (07:36 IST)

పిన్నెలి కారు ఆపి డోరు ఎందుకు తీశారు?

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకని జాతీయ రహదారి వద్ద మంగళవారం   ఉదయం 10 గంటల  సమయంలో  రాజధానిని అమరావతి గా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది మద్దతుదారులు మెరుపు  ధర్నాకు ఉపక్రమించారు.

వందలాది మంది ముందస్తు చర్యలు చేపట్టిన నాయకులందరిని  అదుపులోకి తీసుకుని హౌస్ అరెస్ట్ లు చేసిన ఒక్కటే లక్ష్యం అమరావతి రాజదానిగా కొనసాగించాలి అనే నినాధం తో  నాయకత్వ లేకుండానే రోడ్డేక్కారు. అమరావతి ప్రాంత ప్రజల అక్రందన ఆవేదన నడుమ  నిరసనలు పెల్లుబిక్కాయి. పెద్ద సంఖ్యలో మహిళాలు రోడ్డుపై కూర్చుని తమ గోంతు వినిపించారు. 

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసనకారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. 12.34 నిమిషాల సమయంలో అధికార పక్షానికి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి చినకాకాని సర్వీస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. వేలాది మంది నిరసన కారులు చినకాకాని  జాతీయ రహదారి ని దిగ్బందం చేసి, సర్వీస్ రోడుపై కూర్చుని   నిరసన తెలుపుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే వాహనం ను ఆ మార్గంలోకి పోలీసులు ఎలా అనుమతించారు అనేది ప్రశ్నార్దకంగా వుంది.

ప్రత్యాన్మాయ మార్గాల ద్వార వెళ్లాల్సిన పరిస్దితులలో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్దితుల్లో  ఎమ్మెల్యే వాహనం సర్వీస్ రోడ్డు లో ఎలా రాగలిగింది ? ఆందోళన చేస్తున్న ప్రాంతంలోనే కారు ఎందుకు అపాల్సివచ్చింది. జరిగిన పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తోంది.

జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో నిరసనకారులు వుండగా, సర్వీస్ రోడ్డు లో వృద్దులు , సానూభూతిపరులు ప్రధానం వున్నారు. ఎమ్మెల్యే వాహనం వెళ్తున్న సందర్బంలో ఓ విలేకరి కారులో వున్న ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దీంతో ఎమ్మెల్యే తన వాహనంను అప్పి కారు అద్దం క్రింది తీసి మాట్లాడారు.

ఈ సందర్బంలో ఓ వృద్దుడు రెండు చేతులతో దణ్ణం పెట్టి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వేడుకున్నాడు. ఈ సందర్బంలో గన్ మెన్ వృద్దునిపై చేయి చేసుకున్నాడు. ఇది గమనించిన యువకులు  వృద్ద రైతును కొడతావా అంటూ గన్ మెన్ పై దాడికి పాల్పడారు. వృద్దునిపై దాడి తెలుసుకున్న నిరసనకారులు అగ్రహాం చెంది కారుపై రాళ్ల దాడి చేశారు. 

ఈ ఘటనలో కారులో వున్న  పిన్నెలిపై ఎవరు దాడి చేసేందుకు యత్నించాలేదు. వేలాది మంది నిరసనకారులు అందోళన చేస్తుంటే వారి ముందుకు ఎమ్మెల్యే వాహనం రావడం, రైతులు నిరసన తెలపడం,  గన్ మెన్ రైతుపై దాడి చేయడం , గన్ మోన్ పై యువకులు దాడి చేయడం జరిగిపోయింది.

కోసమెరుపు ఏంటాంటే ఓ ఛానల్ లో గన్ మెన్ రైతును కొట్టిన విజువల్స్ కాకుండా మిగిలిన ఘటన మొత్తం ప్రసారం జరుగుతుంది.