శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 7 జనవరి 2020 (21:28 IST)

విశాఖలో జగన్‌కు ఇల్లు.. ప్లేస్ ఎక్కడంటే?

ఇప్పటికే రాజధాని మార్పుపై ఒక నిర్ణయానికి వచ్చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలపై పెద్ద ఎత్తున ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. అయితే జగన్ మాత్రం తన పని తాను కానించేస్తున్నారు. విశాఖ వేదికగా పరిపాలన రాజధానికి సిద్ధమైపోయారు. స్థలంతో పాటు కొన్ని భవనాలను ప్రస్తుతానికి అద్దెకు తీసుకుని నడిపించేందుకు సన్నద్థమయ్యారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో సిఎం ఇల్లు ఎక్కడ ఉండాలన్నదే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం సొంత ఇల్లు నిర్మించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట. అది కూడా విశాఖలోని బీచ్ దగ్గరలోనే. దీంతో హడావిడిగా వైసిపి విశాఖకు చెందిన ప్రధాన నేతలు స్థల సేకరణలో పడ్డారు.
 
పట్టా ఉండి.. ఎలాంటి గొడవలు లేని స్థలం కోసం చూస్తున్నారు. కనీసం ఒకటిన్నర ఎకరా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలన్నది జగన్ ఆలోచనట. అయితే బీచ్ ప్రాంతంలో ఎక్కడా కూడా అంత స్థలం లేదు. దీంతో పాతబడిన ఇళ్ళు ఏవైనా విక్రయిస్తారేమోనని నేతలందరూ వెతకడం ప్రారంభించారు. కష్టమైనా సరే అధినేతకు మంచి స్థలం చూపించి ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలని నేతలు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారట.