సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 18 జూన్ 2017 (12:24 IST)

భర్తకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం: మనస్తాపంతో భార్య ఆత్మహత్య

భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకోవడంతో మనస్తాపానికి గురైన భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన

భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకోవడంతో మనస్తాపానికి గురైన భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన తోట విమలకుమారిని కానూరు సనత్‌నగర్‌కు చెందిన తోట సురేష్‌ కుమార్‌ 2005లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్‌కుమార్‌ కాకినాడలోని శ్రీరామ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. 
 
అదే కంపెనీలో పనిచేస్తున్న మహిళతో అతడు వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. వీరిద్దరికి పెద్దలు సర్దిచెప్పినా.. భర్తతో భార్య ఇదే విషయమై గొడవకు దిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య విమలకుమారి ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.