శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (16:35 IST)

జగన్ సంకల్ప యాత్ర స్టార్ట్.. చంద్రబాబులో అసహనం (వీడియో)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్రలు ఆయా పార్టీలకు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. రాజకీయ పార్టీల అధినేతలను ప్రజలకు దగ్గరచేశాయి. పాదయాత్ర పునాదిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్రలు ఆయా పార్టీలకు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. రాజకీయ పార్టీల అధినేతలను ప్రజలకు దగ్గరచేశాయి. పాదయాత్ర పునాదిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ కోవలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు ఉన్నారు. అది గత చరిత్ర. ఇప్పుడు ఏపీలో ప్రజాసంకల్ప యాత్ర తెరపైకి వచ్చింది. అయితే, ఓ పక్క సర్కారులో అసహనం.. మరో పక్క పాదయాత్రకు సై అంటున్న వైసీపీ శ్రేణులు.. వెరసి ఏపీ రాజకీయాలను మరింతగా వెడెక్కిస్తున్నాయి.
 
నిజానికి మీటింగులు, ప్రెస్‍‌మీట్లు పెట్టడం కంటే పాదయాత్రకున్న క్రేజ్ వేరు. పాదయాత్ర ఓ దీక్షలాంటింది. అది నమ్మిన వారికి ఫలితాన్నిచ్చింది. క్రమశిక్షణగా, చిత్తశుద్ధితో ప్రజలముందుకు వెళ్లినవారిని ఆదరిస్తుంది. ఆదరించింది కూడా. ఇప్పుడు ఏపీలో సుదీర్ఘ పాదయాత్రకు జగన్ శ్రీకారం చుట్టారు. గతంలో ఓ పాదయాత్ర తర్వాత బలం పుంజుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పాదయాత్ర పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్రకు నడుంబిగించారు. నవంబర్ 6వ తేదీన ఉదయం 9.30 గంటలకు వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్సార్‌ సమాధికి నివాళులు అర్పించి, ఆపై ప్రజలనుద్దేశించి ప్రసంగిచడంతో తన పాదయాత్రను ప్రారంభించినట్టయింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో అడుగడుగునా సమస్యలే దర్శనిమిస్తున్నాయి. అధికారపక్షం మాటలకు చేతలకు పొంతనలేని పరిస్థితి నెలకొందని విపక్ష పార్టీల నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపటం తప్ప వాస్తవంగా జరుగుతున్నది శూన్యమనే ఆరోపణలు లేకపోలేదు. ఈ అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా అంశం, రైతుల సమస్యలు, ఇలా ఏపీని అనేక సమస్యలు చుట్టుముట్టివున్నాయి. ఈ తరుణంలో జగన్ పాదయాత్రకు పూనుకోవడం అత్యంత ఆసక్తికరంగా మారింది. గతంలో వైఎస్ఆర్, చంద్రబాబు పాదయాత్రలు చేపట్టి విజయం సాధించారు. మరి జగన్ ఎంత మేరకు సక్సెస్ సాధిస్తారో వేచిచూడాల్సిందే.