Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 : పవన్ కళ్యాణ్ గెలుపుపై సర్వత్రా ఆసక్తి!!

Written By వరుణ్
Updated: మంగళవారం, 4 జూన్ 2024 (08:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందుకే ప్రతి ఒక్కరి నోటా పవన్ మాటే వినిపిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. పైగా, పిఠాపురంలో ఎన్నడూలేని విధంగా 86.63శాతం పోలింగ్‌ నమోదైంది. అర్థరాత్రి వరకూ మహిళలు సైతం పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో పవన్‌ గెలుపు ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతుంది. మరోవైపు జూన్‌ ఒకటిన వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ భిన్నంగా ఉన్నాయి. అత్యధిక సర్వే సంస్థలు పవన్‌ కల్యాణ్‌ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని వెల్లడించాయి. మరికొన్ని సర్వేలు వైకాపా అభ్యర్థిని వంగా గీత గెలుస్తారని అంచనాలు వేశారు. పవన్‌ కూటమి ఏర్పాటులో ముఖ్య పాత్ర వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధిక సీట్లలోనూ జనసేన అభ్యర్థులను బరిలో దించారు. విస్తృతంగా పర్యటించి సభలు నిర్వహించారు. తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు కలియదిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వారికి భరోసా ఇచ్చారు. 
 
దీంతో అనేక మంది మద్దతు పలికారు. ఆయన గెలుపు ఏ విధంగా ఉంటుందనే దానిపై బెట్టింగ్‌లు సైతం జరుగుతున్నాయి. పవన్‌ గెలిస్తే ఒక చరిత్ర సృష్టిస్తారన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో పిఠాపురానికి కూడా దేశంలో ప్రత్యేక స్థానం నెలకొంటుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వర్మ.. పవన్‌ 60 వేల మెజార్టీతో గెలుస్తారని ప్రకటించారు. గెలుపు, మెజార్టీ పరంగా పవన్‌ కల్యాణ్‌ విజయం కొన్నాళ్లపాటు నిలిచిపోయేలా ఉంటుందని సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు సైతం ఆయన గెలుపు ఖాయమంటూ పోస్టులు పెడుతున్న తరుణంలో మంగళవారం వచ్చే ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

అన్నీ చూడండి

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Kaka Latest: బాధ్యతల గల పాత్రగా కాకా ని మలుస్తున్న బాబీ కొల్లి - చిరంజీవిపై కీలక సన్నివేశాలు

తర్వాతి కథనం
Show comments