శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (10:00 IST)

విద్యాభివృద్ధి కృషి చేస్తా: వెట్రిసెల్వి

ఏపీ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులుగా కె.వెట్రిసెల్వి (ఐ.ఎ.ఎస్) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే విద్యా శాఖలో ఆంగ్లమాధ్యమ ప్రత్యేక అధికారిణిగా సేవలందించిన విషయం తెలిసిందే.

ఆంగ్ల మాధ్యమ ప్రత్యేక అధికారిణిగా విశేష సేవలందించిన ఆమెను వాడ్రేవు చినవీరభద్రుడు స్థానంలో సమగ్ర శిక్షా ఎస్పీడీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం కె.వెట్రిసెల్వి సమగ్ర శిక్షా సిబ్బందితో మాట్లాడుతూ... ‘అందరి భాగస్వామ్యంతో సమగ్ర శిక్షా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.

కార్యక్రమంలో సమగ్ర శిక్షా అదనపు రాష్ట్ర పథక సంచాలకులు -1 ఆర్.మధుసూదనరెడ్డి, సమగ్ర శిక్షా అదనపు రాష్ట్ర పథక సంచాలకులు -1 పి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా.బి.ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ గ్రంథాలయాల డైరెక్టర్ దేవానందరెడ్డి, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, కేజీబీవీ కార్యదర్శి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొని వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా స్వాగతించి పుష్పగుచ్ఛాలు అందజేశారు.