మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (20:54 IST)

ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం: ఎపిఎస్‌ఎస్‌డిసి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు.

సోమవారం తాడేపల్లిలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎపిఎస్‌ఎస్‌డిసి -ఎక్సెలర్ సంస్థ ఆధ్వర్యంలో డేటా అనలిటిక్స్ పై శిక్షణను ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు.

సోమవారం నుంచి ప్రారంభమైన ఆన్ లైన్ శిక్షణ 40 రోజులపాటు కొనసాగుతుందని ఎపిఎస్‌ఎస్‌డిసి - ఎక్పెలర్ సంస్థ ఆధ్వర్యంలో ఇంజనిరంగ్ పూర్తిచేసిన వారికి మరియు ఇంజనీరింగ్ (ఇసిఇ, సిఎస్ఇ / ఐటి) & ఎంటెక్ (ఇసిఇ, సిఎస్ఇ/ఐటి) చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 40రోజల (80 గంటలు) కోర్సును ఆన్ లైన్ ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్టు చల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు.  
 
ఇప్పటి వరకు డేటా అనలిటిక్స్ ఆన్లైన్ శిక్షణ కోసం 3,272 మంది ఆన్ లైన్ శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ చెప్పారు.

కోవిడ్ వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో ప్రముఖ కంపెనీలకు చెందిన నిపుణులతో ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నామని, ఈ ఆన్ లైన్ శిక్షణ కార్యక్రమాల ద్వారా నిరుద్యోగ యువత, విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుందని అర్జా శ్రీకాంత్ అన్నారు. 
 
అనంతరం ఎపిఎస్‌ఎస్‌డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ డి.వి. రామకోటిరెడ్డి మాట్లాడుతూ మార్కెట్ లో డిమాండ్ ఉన్న డేటా అనలిటిక్స్ లాంటి కోర్సులు నేర్చుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఎస్‌డిసి చీఫ్ జనరల్ మేనేజర్- టెక్నికల్ డాక్టర్ రవి గుజ్జుల, ఎక్సెలర్ సొల్యూషన్స్ సంస్థ సీఈవో రామ్ తవ్వ కూడా పాల్గొని డేటాఅనలిటిక్స్ కోర్సు ప్రాముఖ్యత, ఉపయోగాలు, ఉద్యోగ అవకాశాల గురించి విద్యార్థులు, యువతకు వివరించారు.