శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 12 జులై 2020 (17:04 IST)

14కోట్ల ఉద్యోగాలపై కరోనా కాటు ప్రభావం

కరోనా ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా చూపడం ప్రారంభమైంది. ఈ కారణంగా ఇప్పటికే కోట్లాదిమంది రోడ్డున పడగా.. మరికొన్ని కోట్ల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. 
 
సిడ్నికి చెందిన 'ప్లోస్‌ వన్‌' అనే రీసెర్చ్‌ సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వైరస్‌ ఉదృతి వల్ల 14కోట్ల70లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆ సంస్థ తెలిపింది. అదేవిధంగా కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయంగా 3.8ట్రిలియన్ల ఉత్పత్తిని కంపెనీ యాజమాన్యాలు నష్టపోయారని నివేదిక పేర్కొంది. 
 
అయితే తమ సర్వేలో తయారీ రంగం, పర్యాటక రంగం, రవాణా రంగాలు తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొంది. మరోవైపు ఉత్పత్తికి అంతరాయం కలగడం వల్ల 2.1ట్రిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఉద్యోగులు నష్టపోయినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది.
 
అయితే కరోనా కారణంగా ప్రజలు రవాణాకు దూరంగా ఉండడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గినట్లు నివేదిక తెలిపింది. కరోనాను నివారించేందుకు ప్రభుత్వాలు పరష్కార మార్గాలను ఆలోచించాలని సర్వే ప్రతినిధులు పేర్కొన్నారు.
 
కాగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొందని ఆర్థిక నిపుణులు విశ్లేషించారు.