శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 14 జూన్ 2019 (15:58 IST)

ఎర్రచందనం గోడౌన్‌లలో ఎందుకు అమ్మేద్దాం.. జగన్ సంచలన నిర్ణయం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు సీఎంగా పగ్గాలు చేపట్టిన గంటల్లోనే చర్యలు చేపట్టారు. తాజాగా జగన్ తీసుకోనున్న నిర్ణయంతో టీడీపీ షాకయ్యేలా వుంది. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది. మాములుగా ఎర్రచందనంకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. అందుకే వాటిని విదేశాలకు అక్రమంగా తరలించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. 
 
ఎర్రచందనం తిరుపతి శేషాచలం అడవుల ప్రాంతంలోనే అత్యధికంగా దొరుకుతాయి. అందువల్ల అక్కడ నుంచే వీటిని దుండగులు నరికి అక్రమంగా తరలిస్తారు. ఆ ఆసమయంలో పట్టుకున్న పోలీసులు చేతికి ఇప్పటికే ఎన్నో టన్నుల దుంగలు ప్రభుత్వ ఆధీనంలోనే గోడౌన్‌లో ఉన్నాయట. 
 
వీటన్నిటిని వీటికున్న డిమాండ్ నిమిత్తం అమ్మినట్టయితే ఆ వచ్చే ఆదాయంతో రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకోవచ్చునని జగన్ భావిస్తున్నారట. ఈ సంచలన నిర్ణయానికి టైమ్ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి మరి.