మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 13 జూన్ 2019 (20:50 IST)

ప్రజలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి... రోజూ ఉదయం పూట...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు చూపిస్తున్నారు. తన తండ్రి దివంగత వైఎస్ మాదిరిగానే ప్రజలతో మమేకం అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఒకవైపు సమీక్షలు, అధికారులతో భేటీలు, మంత్రులకు దిశాదిర్దేశం చేస్తూనే.. మరోవైపు ప్రజలకి చేరువయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 
 
దీనికోసం త్వరలోనే ఏపీ సీఎం జగన్ ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ ఉదయం 30 నిమిషాల పాటు ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించనున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల మొదటివారం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
సీఎంను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి... వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్దఎత్తున తరలివస్తుండటంతో.. సెక్యూరిటీ నిబంధనలు అడ్డొస్తున్నాయి. దీంతో ప్రజాదర్బార్‌లో ప్రజలను కలుసుకోనున్నారు ఏపీ ముఖ్యమంత్రి.