మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 14 జూన్ 2019 (15:06 IST)

చంద్రబాబు కీలక నిర్ణయం... 2023లో గెలుపే లక్ష్యంగా పీకేతో సంప్రదింపులు?

తాజా ఎన్నికల ఫలితాలతో ఢీలా పడ్డ తెలుగుదేశం పార్టీ శ్రేణులు 2023లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, బలమైన ఓటు బ్యాంకు ఉన్న తెలుగుదేశం పార్టీ కేవలం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు పరిమితం అయిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించారు. 
 
గుంటూరులో జరిగిన టీడీపీ సమీక్షా సమావేశం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... గతంలో పార్టీ ఓటమికి గల కారణాలు తెలిసేవి. కానీ ఈసారి ఓటమికి కారణాలు కూడా తెలియట్లేదని వ్యాఖ్యానించారు. ఫలితాలు ఎలా ఉన్నా మళ్లీ పార్టీకి పునర్వైభవం తీసుకురావడం ఎలా అనే దానిపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు చంద్రబాబు.
 
అందులో భాగంగానే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృదంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓ ఉత్తరాది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. 2014 మోడీ విజయంలోనూ, నితీష్ కుమార్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకే టీం పాజిటివ్ ఫలితాలు వచ్చినా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్‌కు వర్కవుట్ కాలేదు.