శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఆగస్టు 2018 (09:20 IST)

తాగొచ్చి కొట్టేవాడు అందుకే నోట్లో దోమల మందు స్ప్రే చేసి వాడిని చంపేశా...

హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో భార్య సరికొత్త విషయాన్ని వెల్లడించింది. మద్యం సేవించి వచ్చిన తన భర్త నోట్లో దోమల మందు స్ప్రే చేసి, ప్రియుడు జగన్‌తో కలిసి హత్య చేసినట్టు హ

హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో భార్య సరికొత్త విషయాన్ని వెల్లడించింది. మద్యం సేవించి వచ్చిన తన భర్త నోట్లో దోమల మందు స్ప్రే చేసి, ప్రియుడు జగన్‌తో కలిసి హత్య చేసినట్టు హతుని భార్య వెల్లడించింది. దీంతో జగన్ హత్య కేసులో భార్యే ప్రధాని నిందితురాలని తేలింది.
 
ఇటీవల జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన జగన్, దేవి అనే దంపతులు వెళ్లారు. అయితే, జగన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో హత్యకు గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. 
 
భార్య దేవిక వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు ఎదుట లొంగిపోయిన నిందితురాలు దేవిక అసలు నిజం బయటపెట్టింది. మద్యం మత్తులో ఉన్న భర్త జగన్ నోట్లో దోమల మందు స్ర్పే చేసినట్లు తెలిపింది. 
 
జగన్ స్పృహ కోల్పోయిన వెంటనే ప్రియుడు బెనర్జీని పిలిచి హత్య చేసినట్లు ఒప్పుకుంది. జగన్ హత్య తర్వాత బెనర్జీ పారిపోయినట్లు తెలిపింది. దీంతో బెనర్జీని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.