బాపట్ల చావలి గ్రామంలో మహిళా వలంటీరు హత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో ఆదివారం దారుణం జరిగింది. జిల్లా పరిధిలోని వేమూరు మండలం చావలి గ్రామంలో వలంటీరుగా పని చేస్తున్న శారద అనే మహిళను అదే గ్రామానికి చెందిన దారుణంగా కొట్టి చంపేశారు. నిందితుడిని పద్మారావుగా గుర్తించారు.
ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు... గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈ హత్య వివాహేతర సంబంధం కారణంగా జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.