ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (18:50 IST)

లాలాగూడలో వ్యక్తి దారుణ హత్య.. పాతకక్షలే కారణమా?

murder
లాలాగూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. హత్యకు గురైన వ్యక్తిని కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని లాలాగూడలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. 
 
హత్యకు గురైన వ్యక్తి 2017లో జరిగిన హత్యకేసులో  ప్రధాన నిందితుడు (అఫ్సర్‌)గా ఉన్నాడని, ఇటీవలే జైలుకు వెళ్లివచ్చాడని పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే అతడిని చంపివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఇకపోతే.. బంజారాహిల్స్‌‌లో కూడా ఓ హత్య సంచలనం సృష్టించింది. జిర్రా సమీపంలోని షాషిబ్లీహిల్స్‌కు చెందిన మహ్మద్‌ ఒమర్‌ అలియాస్‌ చింటూ(25) ప్లంబర్‌. రెండేండ్ల క్రితం ఓ చోరీ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో అతనికి జైల్లో మహ్మద్‌ అమీర్‌(22)తో పరిచయం ఏర్పడింది. 
 
జైలు నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ కలిసి దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తుండేవారు. సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి ఆటోలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలానికి వచ్చి అర్థరాత్రి దాకా మద్యం సేవించారు. 
 
మద్యం మత్తులో గొడవ పడడంతో అమీర్‌ తన వద్ద ఉన్న బీర్‌బాటిల్‌తో ఒమర్‌పై దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి జకీరాబేగం ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.